సంగం మండలం, సంగం బ్యారేజ్ ను మండల రెవెన్యూ అధికారి రమాదేవి, ఎస్సై నాగార్జున రెడ్డి మంగళవారం సందర్శించారు. రొట్టెల పండుగ నేపథ్యంలో యాత్రికులు కోసం తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మండల రెవెన్యూ అధికారి, ఎస్సై, చర్చించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయితీ, అధికారుల సమన్వయంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని మండల రెవెన్యూ అధికారి తెలిపారు. బ్యారేజ్ వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.