కంబదూరు మండలంలోని కురాకులపల్లి గ్రామ శివారులో, కళ్యాణదుర్గం మండలం కురాకులతోటలో మంగళవారం ఉదయం చిరుతలు సంచరించడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట చిరుతలు తిరుగుతుండటంతో గ్రామాలు, పొలాల్లో ఒంటరిగా తిరగలేకున్నామని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చిరుతల దాడి నుంచి రక్షించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa