జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేయాలని ఏపి పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ సూచించారు. మంగళవారం కళ్యాణదుర్గం ఆర్. అండ్. బి అతిథి గృహంలో ఏపీసిసి మెంబర్ రాంభూపాల్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు. శైలజనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 2ఎంపీ, 14అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టిడిపి అభ్యర్థులందరికి బాధ్యతలను గుర్తుచేశారు.