అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన హరిత అనంత మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ గత కరోనా కష్ట సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని అన్నారు.