ఒంగోలులోని కార్పొరేట్ ఆఫీస్ నందు విద్యుత్ ఉద్యోగుల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్ఈ బీజే. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని చైతన్య కార్డియక్ సెంటర్ ద్వారా గుండె, కంటి పరీక్షలు చేయటం జరుగుతుందని ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం కూడా సంస్థకు ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. అందుకే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.