జులై 17, 2024 నాడు తొలి ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి చాతుర్మాసం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచి నాలుగు నెలల పాటు శుభ కార్యాలు జరగవు.తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణుమూర్తి తొలి ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రావస్థలో ఉన్న తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణు మూర్తి మేల్కొంటాడని భక్తుల విశ్వాసం. ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని పిలుస్తారు. ఇందులో వివాహం, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలు నిర్వహించారు. విష్ణువు నిద్రలోకి వెళ్ళిన తరువాత విశ్వాన్ని నడిపించే బాధ్యతను శివుడు స్వీకరిస్తాడు. అందుకే చాతుర్మాసాలలో శివుడిని పూజించడం విశేషం. ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.
తొలి ఏకాదశి పరిహారాలు:
మీరు శ్రీమహావిష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వస్తుంది. కావున ఈ రోజు సాయంత్రం పూట చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ రోజున శ్రీమహా విష్ణువు వ్యక్తిగతంగా రావి చెట్టుపై కూర్చుంటాడని చెబుతారు. అంతే కాకుండా ఈ రోజు రెండు రూపాయలు తీసుకుని దేవుడి పూజలో ఉంచుకోవాలి. ముందుగా భగవంతుని పంచామృతాలతో అభిషేకం చేయించాలి. ఆపై లక్ష్మీదేవి ముందు ఒక రెండు రూపాయలను ఉంచి పూజ చేయాలి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు. ఈ రోజు తులసిపై నెయ్యి దీపం కూడా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందానికి లోటు ఉండదు. ఏకాదశి ఉపవాసం రోజున రాత్రి జాగరణకు కూడా ప్రాముఖ్యత ఉంది. కావున ఈ ఏకాదశి రోజు రాత్రి విష్ణుమూర్తిని జపించాలి.
ఏకాదశి రోజున పఠించాల్సిన మంత్రాలు:
ఏకాదశి నాడు మహా విష్ణువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించాలి. ఏకాదశి తిథి నాడు జపించడం వల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం శ్రీ విష్ణువే చా విద్మహే వాసుదేవాయ ధీమహి, తనో విష్ణు ప్రచోదయాత్
కృష్ణ వాసుదేవాయ హరాయ పరమాత్మనే పురాణాంతః కాలేశాయ గోవిందాయ నమో నమః
ఓం శ్రీ కృష్ణ శరణం మమ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే హరే
ఈ విష్ణు మంత్రాలు పఠించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. భయం అనేది ఉండదు. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. ఈ మంత్రాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. గతంలో చేసిన పాపాలు తొలగి పోయేందుకు సహాయపడతాయి.
నోట్: పై వార్తలోని అంశాలను ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. 'దిశ' ఈ విషయాలను ధృవీకరించడంలేదు.