భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగిపోయిందని సీఎంఐఈ తెలిపింది. గత ఏడాది జూన్‌లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉండగా.. ఈ జూన్‌లో 0.7 శాతం పెరిగిందన్నారు.