డయేరియా నివారణపై దృష్టి సారించాలని కడప జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సిద్దవటం మండల అభివృద్ధి కార్యాలయ భవనంలో మంగళవారం డయేరియా నివారణపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో తాగు నీటి ట్యాంకులు శుభ్రపరిచి నోటీసు బోర్డులో నమోదు చేయాలని, తాగునీటి శాంపిల్స్ సేకరించాలని సూచించారు. మండల పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్‌ల యజమాను లకు నోటీసులు జారీ చేయాలని తెలియజేశారు. ఎంపీడీవో ఉమామహేశ్వర్‌రావు, ఏపీవో నరసింహులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa