గంబూషియా చేపలతో దోమల లార్వా నివారణ ద్వారా డెంగ్యూను అరికట్టడం సాధ్యమని సంబేపల్లె ప్రాథమిక వైద్యాధికారులు మడితాటి మధుసూదనరెడ్డి, అంకం సూర్యనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం పాండురాజులబండ వద్ద మురుగు నీటిలో గంబూషియా చేపలు వదిలారు. ఈ చేపలు దోమల లార్వాలను తినేస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల పరిసరాల్లో మురుగు నిల్వలు లేకుండా చూడాలన్నారు. సాయంత్రం వేళల్లో వేపాకు పొగ వేయడం ద్వారా దోమ కాటు నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో దోమ తెరలు వాడాలని తెలియ జేశారు. జ్వరాలు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు రాకుండా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. జ్వరం సోకిన వెంటనే దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని తెలియ జేశారు. ఈ కార్యక్ర మంలో సబ్‌యూనిట్ అధికారులు ప్రసాద్, జయరామయ్య, ఎల్‌టీ నాగ రాజు, అసిస్టెంట్ రవిశంకర్, ఏఎనఎం వరలక్ష్మి, ఆశావర్కర్ తదితరులు పాల్గొన్నారు.