కర్నూలు జిల్లాలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న డీఎస్సీ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సుంకన్నను విద్యార్థి సంఘం నాయకులు కోరారు. మంగళవారం డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సుంక న్నను కలిసి పీడీఎస్‌యూ రాజేష్, డీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శరత్, యూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ విడుదల చేయడం వలన నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోచింగ్ సెంటర్లకు వెళితే నిర్వా హకులు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కోచింగ్ సెంటరులో ఎలాంటి కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ వందలాది మందికి అడ్మిషన్లు కల్పించి శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఈ కేంద్రా లలో మహిళా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీను, అఖిల్, రవి, సాయి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.