రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల పండుగ తొలిఏకాదశితో, ముస్లింలు మొహరం పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుండగా.. ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా కదిరిలో మాత్రం హిందూ, ముస్లింల మధ్య వివాదం చెలరేగింది. తొలిఏకాదశి సందర్భంగా కదిలోని బొడ్డుచావిడి వద్ద హిందువుల పూజలు చేస్తున్నారు. మరోవైపు మొహరం సందర్భంగా ముస్లింలు కూడా డప్పులతో పీర్లను ఊరేగిస్తూ అదే ప్రాంతానికి వచ్చారు. ఈ క్రమంలో పీర్ల ఊరేగింపును యువకులు అడ్డుకున్నారు. దీనిపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు బస్టాండ్ వద్ద ముస్లింలు ధర్నాకు దిగారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గొడవ పెద్దది కాకుండా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.