బొబ్బిలి మండలంలోని పెంట వేగావతి నది నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు మూడు ట్రాక్టర్లను మంగళవారం పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇసుకను వేగావతి నది నుంచి అక్రమంగా తరలిస్తుండగా స్థానిక మహారాణిపేట, రంగరాయపురం గ్రామాలకు చెందిన డ్రైవర్లు రామకృష్ణ, నాగభూషణం, సాయికుమార్‌ను ఎస్‌ఈబీ అధికారులు అడ్డుకుని తమకు అప్పగించగా వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచామని ఏఎస్‌ఐ జి.భా స్కరరావు తెలిపారు. ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి మూడువేల రూపాయల చొప్పున జడ్జి జరిమానా విధించినట్లు భాస్కరరావు తెలిపారు.