అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో బీసీ బాలుర గురుకుల పాఠశాలను నిర్మించాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ను కోరారు. బుధవారం టిడిపి జాతీయ కార్యాలయంలో బీసీ శాఖ మంత్రి సవిత కు వినతిపత్రం సమర్పించారు. రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బీసీ విద్యార్థులు ఉన్నారని వారికి అనుగుణంగా నందలూరు మండలంలో బీసీ గురుకుల పాఠశాలను నిర్మించాలని కోరానన్నారు.