రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలను నిర్వహించారు. టంగుటూరులో పీర్ల చావిడిలో పీర్లకు కులమతాలకు అతీతంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి చదివింపులు చేశారు. బాబా ఫక్రుద్దీన్ స్వామి పీర్ ను పూలతో అలంకరించి, మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. దారి వెంబడి భక్తులు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి చదివింపులు చేశారు.