బీటీ కలాశాల అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇప్పించామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు. బుధవారం మదనపల్లెలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించిందన్నారు. సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో మంగళగిరికి వెళ్లి ప్రజా దర్భార్ నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేశ్ కు సమస్య విన్నవించాలని సూచించగా అధ్యాపకులు వెళ్లి లోకేశ్ ను కలవడంతో జీతాలు విడుదలయ్యాయన్నారు.