మదనపల్లె పర్యటనకు బుధవారం వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాయలసీమలోని రోడ్ల అభివృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతిపత్రం అందించారు. రాజంపేట-రాయచోటి- కదిరి స్టేట్ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని, కడప-రాయచోటి రోడ్ ను 4 లైన్లకు విస్తరించాలని, అన్నమయ్య జిల్లాలో మౌలిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాగా ఆదినాథ్ శ్రీగురు మహావతార్ బాబాజీ ఆలయ ప్రాణప్రతిష్ఠలో గడ్కరీ పాల్గొన్నారు.