కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లకి మోసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమవుతున్నారు.. మరో వారం రోజుల్లోనే నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకొంది. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను అధినేత సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి, సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట.