అద్దంకి మండలం శంకవరప్పాడు పొలాలలో విద్యుత్ నియంత్రిక రాగి తీగ అపహరణకు గురైన నేపథ్యంలో విద్యుత్ ఏఈ శివప్రసాద్ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రత్నకుమారి తెలియజేశారు. పొలాలలో రాగి తీగ అపహరణకు గురైనట్లు గుర్తించి రైతులు శ్రీనివాసరెడ్డి, రమేష్ లు విద్యుత్ ఏఈ శివప్రసాద్ కు తెలియజేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.