పెదబయలు మండలంలోని గుల్లెలు పంచాయతీ పరిధి పోయిపల్లి గ్రామంలో విద్యుత్ తీగలను సరిచేయాలని గిరిజనులు బుధవారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ తీగలు తెగిపడి నేలకు తాకి ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని సంబంధిత శాఖ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేస్తే గుల్లేలు పంచాయితీ పరిధి గ్రామాల గిరిజనుల కరెంటు కష్టాలు తీరుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa