పాయకరావుపేట ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను శుక్రవారం తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హోంమంత్రి అనిత శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హోం మంత్రి అనితని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి ప్రటిష్ట చర్యలు తీసుకోవాలని హోం మంత్రి ఆదేశించారు.