ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనకి, నాకు ఎటువంటి సంబంధం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 05:39 PM

నరసాపురం ఎంపీడీవో ఎం. వెంకటరమణారావు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. బాకీ ఉన్న మొత్తం కన్నా డాక్యుమెంట్లు విలువే ఎక్కువని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే తనకే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్నారు. ఈ వ్యవహారంతో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు ఎటువంటి సంబంధం లేదని, తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని రెడ్డప్ప ధవేజీ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com