వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న యూపీఎస్సీ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఐఏఎస్ ఉద్యోగం కోసం ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు గుర్తించిన యూపీఎస్సీ.. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఐఏఎస్ సెలక్షన్ రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా భవిష్యత్‌లో మళ్లీ యూపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా పూజా ఖేద్కర్ రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి.. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పూజా ఖేద్కర్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పూజా ఖేద్కర్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు యూపీఎస్సీ శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ నిబంధనలను ఉల్లంఘించేలా పూజా ఖేద్కర్.. ఫేక్ డాక్యుమెంట్లతో సివిల్సి పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. అందులో తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్‌కు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడ్డారని యూపీఎస్సీ వెల్లడించింది.
ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న పూజా ఖేద్కర్.. ప్రొబేషనరీ సమయంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వీఐపీ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేసిన ఆమె.. అప్పటి నుంచి వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. మొదట మహారాష్ట్రలోని పూణే జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌ను.. ఈ వివాదం ప్రారంభంలోనే బదిలీ వేటు పడింది. దీంతో వాసిం జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు, వివాదాలు ముసురుకోవడంతో.. ఏకంగా పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌ను రద్దు చేసి.. అకాడమీకి రావాలని పిలుపువచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె సెలెక్షన్ రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా ఖేద్కర్.. అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు.. భవిష్యత్తు పరీక్షల నుంచి కూడా ఆమెను డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేద్కర్‌కు జారీ చేసింది.