తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7. 80 అడుగులు వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుండి 3 లక్షల 09 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తివేశారు.