కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదానం నిర్వహించారు.