ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో శరవేగంగా పనులు జరగనున్నాయి. కూటమి సర్కార్‌కు ఇదొక తియ్యటి కబురే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన తర్వాత.. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సహకారంతో పోలవరం సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వెళతామన్నారు. పోలవరానికి రావాల్సిన రూ. 12,157 వేల కోట్లు త్వరగా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఇందులో 8 వేల కోట్ల రూపాయిలు పునరావసానికి ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa