కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం అందించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.... ‘‘మన రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌లో రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, గౌరవనీయులు కేంద్ర ఆర్థిక మంత్రి ఎన్ సీతారామన్‌జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు. కేంద్రం అందించిన ఈ తొడ్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పునర్నిర్మాణానికి దొహదం చేస్తుంది. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్ సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.