తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను మదనపల్లిలోని ఓ హోటల్ యజమానిని బెదిరించి 15.7 ఎకరాల ఆస్తులు రాయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వివాదాస్పద భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఇతని ద్వారా లాభం జరిగిన నేపథ్యంలో కడప నుంచి వచ్చిన పోలీస్ ప్రత్యేక బృందం విచారిస్తున్నారు.