రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చి మంచి పరిపాలన అందిస్తున్నామని కర్నూల్ ఎంపీ బి.నాగరాజు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి నిధులు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని శాఖల మంత్రులను కలిసి అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే... జగన్ ఢిల్లీ వచ్చి ఫోటో షూట్ పెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి నిర్వాకం తెరపైకి రాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. వినుకొండలో రషీద్ హత్యను టీడీపీపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వించారన్నారు. నీటి ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు వెళ్తే అక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారని వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో తెలంగాణకు భాగం ఇస్తున్నారని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉందని విధ్వంసం చేశారన్నారు. ఏరోజైనా అమరావతి పేరు పార్లమెంట్‌లో విన్నారా అని అడిగారు. జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళారని విమర్శించారు. జగన్ ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున పోరాటం చేయాలని సూచించారు. జగన్ దశ అయిపోయిందని.. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దని ఎంపీ బి.నాగరాజు పేర్కొన్నారు.