కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌పై తనను కలిసిన మీడియాతో సీఎం కొద్దిసేపు చిట్ చాట్‌గా మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు.