ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలో 100 కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చింతూరు నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు ఐదు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల్లోనే డ్రైవర్లు వంటలు చేసుకుంటున్నారు.