ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు కృష్ణాపురం సచివాలయంలో ఆధార్ స్పెషల్ క్యాంప్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు బుధవారం బాలాధార్ లేనటువంటి 0-5 ఏళ్ల చిన్నారులకు ఆధార్ నమోదు చేయించినట్లు స్థానిక అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. 5-17 సంవత్సరాల వయస్సులో గల వారికి ఆధార్ కార్డులో సవరణలు, బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవలు నిర్వహించినట్లు సచివాలయ సిబ్బంది వెల్లడించారు.