పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ ను అసెంబ్లీలోని తన ఛాంబర్లో బుధవారం కలిశారు. పాతపట్నంలో ప్రభుత్వ ఐటీఐని మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అత్యంత వెనుకబాటు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు.