శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడును కోరారు. రైతులు పండించే కూరగాయలు నేరుగా మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మేందుకు వీలుగా నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీని ద్వారా ఆరోగ్యకరమైన కూర గాయలు అమ్మడానికి రైతులకు అవకాశం ఉంటుందని తెలిపారు.