పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ను సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం స్టేషన్ ఆవరణలోని గదులను, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాలు ముఖ్యమైన కేసులు వివరాలను పరిశీలించి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు.