రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కృషి చేస్తారని తాలూకా అధ్యక్షులు వశీకేరి మహేష్ తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలో సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.