తాడిపత్రి మండలం చిన్నపొలమడలో భర్తపై భార్య దాడికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రంగడు, ఆయన భార్య రేవతి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రేవతి మరో వ్యక్తితో చనువుగా ఉంటోంది. ఈవిషయంలో ఇద్దరూ గొడవపడుతుండేవారన్నారు. ఈ నేపథ్యంలో రేవతితో చనువుగా ఉండే ధర్మ అనే వ్యక్తితో కలిసి దాడికి పాల్పడినట్లు సీఐ వివరించారు.