గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ మరమ్మత్తు పనులను మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య మంగళవారం పరిశీలించారు. క్యాంటీన్ లో పెయింటింగ్, స్లాబ్ పనులు వేగవంతంగా చేయాలని గుత్తేదారుకు సూచించారు. క్యాంటీన్ ను ఆగష్టు 15 న ప్రారంభిస్తామని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లావణ్య, ఎంఇ గురప్ప యాదవ్, ఏఇలు పాల్గొన్నారు.