మొహర్రంలో భాగంగా పెద్దపప్పూరు మండలంలోని కొట్టాలపల్లిలో మంగళవారం పీర్ల జలధి కార్యక్రమం జరిగింది. ఉదయం పీర్లను గ్రామంలో ఊరేగించారు. ఈసందర్భం గా పీర్లను డప్పు వాయిద్యాల నడుమ అగ్నిగుండ ప్రవేశం చేయించారు. యువకులు అలావ్ తొక్కారు. సాయంత్రం పీర్లను ఊరేగించారు. భక్తులు చక్కెర చది వింపులు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పీర్లను జలధికి తరలించారు.