వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై అక్రమంగా కేసు బనాయించి జిల్లా బహిష్కరణ చేశారని అన్నారు. దుర్మార్గుడైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాల్సిందే’’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రోజుకు 40 వేల లీటర్లు కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. పెద్దారెడ్డి కుటుంబ సభ్యులే కర్ణాటక సారా, ఇసుకను విక్రయిస్తుండటంపై కేసులు నమోదయ్యాయన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి ఆస్తులు కాజేశాడని మండిపడ్డారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించారన్నారు. చట్ట ప్రకారమే ఆ ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తారని... తొందరలో నోటీసులు ఇస్తారని తెలిపారు. కోమటికుంట్లలో సోలార్ యాజమాన్యంను బెదరించి 480 ఎకరాలు కొడుకు పేరుతో రాయించుకున్నారన్నారు. తమ నాయకుడు లీగల్‌గా వెళ్ళమని చెప్పారని... లీగల్ గానే వెళ్తా జగన్ అని జేసీ అన్నారు. అసెంబ్లీలో ఓ తల్లిని ఏమి మాట్లాడించావో గుర్తు పెట్టుకోవాలని.. చంద్రబాబును క్షమాపణ అడుగు జగన్ అని డిమాండ్ చేశారు.