కేంద్ర ప్రభుత్వం జులై 23, మంగళవారం రోజున పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ రోజున దేశ ప్రజలు గూగుల్‌లో దేని కోసం వెతికారో తెలుసా? గూగుల్ ట్రెండ్స్ ప్రకారం ఆ విషయాలేంటో ఓసారి తెలుసుకుందాం. బడ్జెట్‌కు సంబంధించి చాలా కీలక అంశాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలు ఎక్కువగా ట్యాక్స్ రేట్లు, ఉద్యోగాలు, బంగారం గురించి ఎక్కువగా సర్చ్ చేశారటా. గుగూల్ ట్రెండ్స్ అనాలసిస్ ప్రకారం ఈ మేరకు ప్రముఖ ఛానల్ ఓ కథనం వెలువరించింది. బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి. అలాగే ఉద్యోగ కల్పన, హౌసింగ్ స్కీమ్, వ్యక్తిగత ఆదాయపు పన్నులపైనా కీలక ప్రకటనలే చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపేందుకు ఈ విషయంతోనే తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అందరి దృష్టి ఇన్‌కమ్ ట్యాక్స్, గోల్డ్, మొబైల్ ఫోన్స్ వైపు మళ్లిందని చెప్పవచ్చు.
గూగుల్ ట్రెండ్స్ పరిశీలిస్తే ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలుతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఎక్కువగా నిరుద్యోగ సమస్యపై ఆందోళన చెందున్నట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేసిందోనని వెతికినట్లు తెలిసింది. అలాగే గోవా, కర్ణాటక, ఢిల్లీ ప్రజలు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కోసం ఎక్కువగా వెతికారటా. స్థిరాస్తి, ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువగా చేస్తున్న క్రమంలో మూలధని లాభాలపై పన్ను మినహాయింపుల కోసం ఈ మూడు రాష్ట్రాలప్రజలు ఆసక్తిగా చూసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సును 12.5 శాతానికి తగ్గించింది కేంద్రం. అయితే, ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగించింది.
అలాగే ఝార్ఖండ్, గోవా, ఛతీష్ గడ్ ప్రజలు ఎక్కువగా ఇన్‌కమ్ ట్యాక్స్ సంబంధించిన అంశాల కోసం వెతికినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటలకు సంబంధించిన గూగుల్ ట్రేండ్స్ డేటా ప్రకారం ఈ మేరకు వివరాలు తెలిసినట్లు వెల్లడించింది వార్తా సంస్థ. ఐటీ హబ్స్, కర్ణాటక, హరియాణా, గోవా, ఢిల్లీ ప్రాంతాలు ఎక్కువగా కొత్త పన్ను విధానం గురించి వెతికినట్లు తెలుస్తోంది.
జులై 23, ఉదయం 9 గంటల నుంచి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎక్కువగా సర్చ్ చేసింది బంగారం గురించే నటా. అందులోనూ ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందని తేలింది. అంటే బడ్జెట్ రోజున బంగారం గురించి ఏపీ ప్రజలు తెగ వెతికేశారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, పంజాబ్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ కోసం వెతికారు.