కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ కోసం వచ్చే రోగులకు గత వారం రోజులుగా సర్వర్ పని చేయక.. వెబ్‌సైట్ సమస్యతో ఓపీ చీటి లేక వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ పని చేయకపో వడంతో బుధవారం ఉదయం సమస్యల వల్ల రోగులు గంటల తరబడి నిరీక్షిస్తూ క్యూలైన్‌లోనే నిలిచి వున్నారు. ఓ పక్క ఆసుపత్రిలో తనిఖీలో కలెక్టర్ రోగుల రద్దీని తగ్గించాలని ఓపీ కౌంటర్ల దగ్గర సమస్యలు లేకుండా చేయాలని ఆదేశిం చిన ఆసుపత్రి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి ఈ-హాస్పిటల్‌కు సంబధించిన సర్వర్ మొరాయిస్తోంది. వెబ్‌సైట్ సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి వైద్యఆరోగ్య శాఖ సర్వర్ మార్పు చేస్తుందని ఆసుపత్రి అదికారులు చెబుతున్నారు. ఉదయం 12 గంటలైనా బుధవరం ఓపీ కోసం రోగులు క్యూలైన్లలో నిలబడ్డారు. సర్వర్ మొరాయింపు వల్ల గర్భిణులు క్యూలైన్లలో నిరీక్షించలేక కింద పడిపోయారు. క్యూలైన్ల భారీగా ఉండటంతో చాలా మంది గర్భిణులు వెనుదిరిగారు. కలెక్టర్ స్పందించి ఈ-హా స్పిటల్‌కు సంబంధించిన సర్వర్ వెబ్‌సైట్ సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.