టన్నుల కొద్దీ తయారయ్యే చెత్త చెదారాలను సమస్యలుగా చూడకుండా ఆదాయ వనరులుగా మార్చాలనే ఉద్ధేశ్యంతో గత టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో సేకరించిన తడి పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని భావించారు. కానీ ఈ ప్రక్రియ నిర్మాణాలతోనే నిలిచి పోయింది. పెద్ద దోర్నాల మండలంలోని 13 పంచాయతీల్లో నిర్మాణాల కోసం జనాభా ప్రకారం ఆరు నుంచి పది లక్షల రూపాయలు వరకు వెచ్చించి షెడ్లు, తొట్లు నిర్మించారు. చెత్తను సేకరించేందుకు రిక్షాలు కూడా మంజూరయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. సంపద తయారీ పనులు ప్రారంభం కాలేదు. దీంతో లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు వృధాగా మారాయి.