కర్నూలు పెద్దాసుపత్రికి 1988 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ అనుపమ వూడర్ల తన తల్లి పసల రెడ్డెమ్మ జ్ఞాపకార్థం కొత్త ఏఎంసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు రూ.3 లక్షల విలువ గల నాలుగు ఏసీలను విరాళంగా అందించారు. అలాగే ఈ నెల 22 న న్యూఆర్‌ఐసీయూ యూనిట్‌కు 1964 బ్యాచ్‌కు చెందిన ప్రవాస భారతీయ వైద్యుడు డా.రంగారెడ్డి రూ.12 లక్షలు విలువ చేసే 12 మానిటర్లు విరాళంగా అందించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21వ చిన్న పిల్లల వార్డుకు ఈసీజీ మిషన్‌ను చికాగోకు చెందిన నియోనాటాలజిస్టు డా. రామ్మోహన్ కొప్పర్తి విరాళంగా అందించారన్నారు. ఈ నెల 3వ తేదీన కేఎంసీ 1971 బ్యాచ్‌కు చెందిన ఎన్ ఆర్‌ఐ డా.చామర్తి సుబ్బారావు, ఈసీజీ త్రీ చానల్ మిషన్‌ను అందించినట్లు తెలిపారు.