ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని అడిషనల్ కమిషనర్ సత్యవతి అన్నారు. విజయవాడ నగరంలో కాలుష్య నివారణకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో బుధవారం ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ వీఎంసీ పరిధిలోని 36 డంపింగ్ స్టేషన్లలో 1000 మొక్కలు నాటుతున్నామని తెలిపారు. తద్వారా ప్రజలకు వాయువులో ఆక్సిజన్ శాతాన్ని పెంచి కార్బన్‌డయాక్సైడ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.