శాఖాపరమైన పరీక్షలు నిర్వహణకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో ఎపిపిఎస్సీ నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలు నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈనెల 28 నుండి ఆగష్టు 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 1715 మంది ఉద్యోగులు హాజరుకానున్నారు.