మౌనిష అనే మహిళ తన కొడుకు తో ఆశవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువతులు (20) ఆమె స్నేహితు రాలు (18) ఇద్దరు మౌనిష ఇంట్లో ఉంటున్నారు. ఊర్వశి గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన శివశంకర్ (22)తో ఐటిఐ జంక్షన్ వద్ద ఒక డాన్స్ స్కూల్ లో యువతులతో పరిచయం ఉంది. గురువారం తన దగ్గరకి యువతికి రమ్మని ఫోన్ చేయగా రాత్రి కావడంతో రాలేనని చెప్పింది.
మీరు రాకపోతే అక్కడికి వచ్చి మిమ్మల్ని తగలబెట్టేస్తా అని బెదిరించిన కొద్దిసేపటికి అతను వచ్చి వారు ఉంటున్న ఇంటి కిటికీలో నుంచి పెట్రోల్ పోసాడు. బాధిత మహిళలు వెంటనే 112 కు సమాచారం ఇవ్వడంతో పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు వెంటనే అక్కడి నుంచిపరారయ్యాడు. ఇదిలా ఉండగా శివ శంకర్ ను శనివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పాక్సో కేసు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నారు.