ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ కావడంతో చిన్నారుల తల్లి మినతి ప్రదన్ (30) పోలీసులను ఆశ్రయించింది. ఘటనకు సంబంధించి శనివారం వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి అన్నెపు నరసింహమూర్తి వివరాలు వెల్లడించారు. మినతి ప్రదన్ విశాఖ హరిజన జగ్గయ్య పాలెం వద్ద చిన్నారులతో ఒంటరిగా నివసిస్తుంది. ఈనెల 18న విధులకు వెళ్లింది.
తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఇద్దరు చిన్నారులు కనిపించకపోవడంతో తన సొంత గ్రామమైన ఒడిస్సాకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసుల జీరో ఎఫ్ఐ ఆర్ నమోదు చేసి విశాఖ పోలీసులకు కేసును బదిలీ చేశారు. పెందుర్తి పోలీసులు వివరాలు సేకరించి వాసుదేవు జల్లి (32) ని అదుపులోకి తీసుకున్నారు.