భీమిలి మారికవలస లో శనివారం ఘోరం చోటుచేసుకుంది. సుమారు 5 నెలల నుంచి 6 నెలల వయసు గల పసికందు మృతదేహం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. శనివారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో 112 డైల్ కు మారికవలస ప్రాంతం పొదలులలో మృతదేహం ఉందని ఫోన్ రావడంతో పిఎం పాలెం పోలీసులు వెంటనే స్థలానికి చేరుకున్నారనీ పీఎం పాలెం సీఐ వై రామకృష్ణ తెలిపారు.