కోడుమూరు మండల సర్వసభ్య సమావేశంలో ఏపీవో కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అధికారులకు అవిధేయతగా కనిపించింది. ఆయన్ను సస్పెండ్ చేయాలని అధికారులు, రాజకీయ నాయకులు కోరుతున్నారు. శనివారం కోడుమూరు మండల పరిషత్ సమావేశ భవ నంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం లో వేదికపై మండల అధ్యక్షురాలు రూతమ్మ, జడ్పీటీసీ రఘునాథ్‌రెడ్డి, మం డల ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో దివ్య, తహసీల్దార్ గుర్ర ప్ప ఉన్నారు. సమావేశంలో ముందు వరుసలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవో మోదీన్‌బాషా కాలు మీద కాలు వేసుకొని కుర్చున్నా డు. దీన్ని వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు సహించలేకపోయారు. పక్కన కుర్చున్న మండల స్థాయి అధికారులు అవమానంగా భావించారు. చివరికి ఆయన సభా మర్యాద పాటించలేదనే ఆరోపణతో సస్పెండ్ చేయా లని రాజకీయ నేతలు డిమాండ్ చేశారు.