ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పలువురు పేర్కొన్నారు. ఇన్నర్‌వీల్, రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ హ్యూమనరైట్స్ ప్రొటెక్షన కమిషన సంయుక్త ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎంఈఓ-2 గోపాల్‌నాయక్ చేతులమీదుగా మొక్కలు పంపిణీచేయించారు. ప్రధానంగా కేతిరెడ్డి, ఇందిరమ్మ, వైఎస్ఆర్ కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదువేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.